యుద్ధం రాముడితోకాదు.. రాజ్యంతో
కొణిదెల పవన్‌తేజ్ హీరోగా నటిస్తున్న రూరల్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ లవ్‌స్టోరీ ‘జంట’. పాడనికుమార్ కథానాయిక. రాజశేఖర్ యాదవ్ దర్శకుడు. రాజేశ్ గునిశెట్టి, వీరు యాదవ్ నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉన్నది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. రాజకీయప్రముఖులు మెట్ల రమణబాబు, అయితాబత్తుల ఆనందరావు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘ఈ సినిమా ఓ భావోద్వేగ ప్రయాణం. మాస్ ఎలిమెంట్స్ మెండుగా ఉంటాయి. ఇలాంటి కథ ఇప్పటివరకూ రాలేదు. ‘యుద్ధం రాముడితో కాదు..రాజ్యంతో..’ అనే క్యాప్షన్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అని కొణిదెల పవన్‌తేజ్ అన్నారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు. ఈ చిత్రానికి మాటలు: నత్మిక మధు, కెమెరా: రాహుల్ శ్రీవాస్తవ, సంగీతం: సుభాష్ ఇషాన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

