సిటీబ్యూరో, జూన్ 1(నమస్తే తెలంగాణ): మర్రి రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందు వరుసలో నిలుస్తున్నది. ఆ ఫౌండేషన్ వ్యవస్థాకులు, మల్కాజిగిరి ఎమ్మేల్యే మర్రిరాజశేఖర్ రెడ్డి ఆపదలో ఉన్న తన నియోజకవర్గ ప్రజలను ఆదుకోవడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. మల్కాజిగిరికి చెందిన సాయికుమార్ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయాడు.
శస్త్రచికిత్స చేయించుకునేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో మర్రి రాజశేఖర్రెడ్డి ఫౌండేషన్ బాధితుడి పరిస్థితిని తెలుసుకొని అరుంధతి ఆసుపత్రిలో ఉచితంగా శస్త్ర చికిత్స చేసి, వైద్యసేవలందించారు. ఈ విషయాన్ని బాధితుడి చెల్లి మహేశ్వరి సామాజిక మాధ్యమాల వేదికగా మాట్లాడుతూ..పేద ప్రజలకు తోడుగా నిలుస్తూ, ఉచితంగా వైద్యం అందించిన ఎమ్మెల్యే మర్రిరాజశేఖర్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.