ఖైరతాబాద్, మే 30: నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్ వేదికగా శనివారం జరగనున్న తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం టీజేఎఫ్ వ్యవస్థాపకులు, తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్, టీజేఎఫ్ వ్యవస్థాపక సభ్యులు ఎ.రమణకుమార్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి యోగానంద్, సహాయ కార్యదర్శి యార నవీన్‌కుమార్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు అవ్వారి భాస్కర్‌తో కలిసి పరిశీలించారు.
సభా నిర్వహణ ప్రధాన ప్రాంగణం, వేదిక, భోజన ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలివస్తున్న జర్నలిస్టులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అల్లం నారాయణ సూచించారు.