సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : మహాత్మా గాంధీ జయంతి వేడుకలను అక్టోబర్ 2న ఘనంగా నిర్వహించాలని, ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం గాంధీ జయంతి ఏర్పాట్లపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
అదనపు కలెక్టర్ వెంకటాచారి, పర్యాటక శాఖ జనరల్ మేనేజర్ కె.సతాను, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాధాకృష్ణ, ఆర్డీవో మహిపాల్, డీహెంహెచ్వో డాక్టర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. కాగా, నగరంలో శుక్రవారం జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షా సెంటర్లను హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తనిఖీ చేశారు. కోఠి మహిళా యూనివర్సిటీ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు.