ముషీరాబాద్ : టీఎస్ఎస్పీడీసీఎల్ ఆజామాబాద్ డివిజన్ పరిధిలోని 11 కేవీ రామాలయం, శివం, సీఈ కాలనీ, అయ్యప్ప టెంపుల్ ఫీడర్ల పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ విజయభాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
రామాలయం ఫీడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి 12 వరకు న్యూ నల్లకుంట, సిండికేట్ బ్యాంక్, నరేంద్ర పార్కు, రామాలయం పరిసర ప్రాంతాలు, శివం ఫీడర్ పరిధిలో ఉదయం 11.30 గంటల నుంచి 1.30 వరకు శివం, ప్రశాంత్ నగర్, టీఆర్టీ క్వార్టర్స్, నర్సింహ బస్తీ, విద్యానగర్ రైల్వే స్టేషన్, తరుణి సూపర్ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ ఉండదు.
అలాగే సీఈ కాలనీ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు శివం రోడ్, శారదానగర్, సాయిబాబా నగర్ ఈ సేవా, బాగ్ అంబర్పేట్ పరిసర ప్రాంతాలు, అయ్యప్ప టెంపుల్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు సాయి దత్త నర్సింగ్‌హోం, టెలిఫోన్ ఎక్స్ఛేంజ్, శివం, మల్లికార్జున నగర్, ఎరుకలబస్తీ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు.