సిటీబ్యూరో, జూన్ 3(నమస్తే తెలంగాణ): గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో ఆర్బిట్రేషన్ అంశంపై ప్రత్యేక కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డైరెక్టర్ రామేశ్వర్రావు ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్క విద్యార్థి ఈ కోర్సుకు అర్హులేనని తెలిపారు. ఏడాదిపాటు ఉండే ఈ కోర్సును పూర్తి చేయడంలో ఆర్బిట్రేటర్ కన్సల్టెన్సీని సొంతంగా నిర్వహించుకునే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలకు ఏస్కీ సెంటర్లో సంప్రదించాలని పేర్కొన్నారు.