సిటీబ్యూరో: దీపావళి సందర్భంగా తాత్కాలిక పటాకుల విక్రయ దుకాణాల లైసెన్స్‌ల కోసం ఈ నెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఆ తరువాత దరఖాస్తులు స్వీకరించరని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి ఆయా డీసీపీల ద్వారా లైసెన్స్‌లు జారీ అవుతాయన్నారు.
డివిజనల్ ఫైర్ ఆఫీసర్ నుంచి ఎన్ఓసీ, ప్రభుత్వ స్థలమైతే బల్దియా నుంచి ఎన్ఓసీ, ప్రైవేట్ వ్యక్తుల స్థలమైతే ఆయా యాజమాన్యాల నుంచి ఎన్ఓసీ, అగ్రిమెంట్ కాపీలు, గతేడాది జారీ చేసిన లైసెన్స్ ఉంటే ఆ కాపీని పెట్టాలి, సింగిల్ దుకాణం ఉంటే పక్క వారి నుంచి ఎన్ఓసీ, షాప్ సైట్ ప్లాన్, రూ.600 లైసెన్స్ ఫీజు గన్పౌండ్రీలోని, ఎస్బీహెచ్లో హెడ్ అకౌంట్లో జమ చేయాలని సూచించారు. సూచించిన వాటలో ఏమైనా డాక్యుమెంట్లు దరఖాస్తుతో పాటు లేకుంటే ఆయా అర్జీలు తిరస్కరిస్తామన్నారు.