ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ సైఫాబాద్ పీజీ కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగ్లీష్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, బోటనీ, జియాలజీ తదితర విభాగాలలో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శైలజ ఒక ప్రకటన విడుదల చేశారు.
సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం) మార్కులతో పీజీ ఉత్తీర్ణులైన వారు అర్హులని చెప్పారు. పీహెచ్డీ, ఎంఫిల్లతో పాటు నెట్, సెట్ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. ఈ పోస్టుల భర్తీని పూర్తిగా ఉస్మానియా యూనివర్సిటీ నియమ నిబంధనలకు అనుగుణంగా చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు పూర్తి వివరాలతో వచ్చే నెల 8వ తేదీలోగా సంబంధిత కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.