తెలుగు యూనివర్సిటీ, జూన్ 23. అబిడ్స్ బొగ్గులకుంటలో గల తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల(సాయంత్రం)లో వివిధ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. తెలుగు భాషా సాహిత్యాలలో 1965 నుండి విశేష కృషి చేస్తున్న పరిషత్ పిడిసి(ఫ్రీ డిగ్రీ కోర్సు), బి ఏ (లాంగ్వేజెస్), కోర్సులు కొనసాగుతున్నాయని అన్నారు.
పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు రెండేళ్ల పిడిసి కోర్సుకు అర్హులని వెల్లడించారు. ఇంటర్ పూర్తి చేసిన వారు బిఏ లో డిగ్రీ ఆన్లైన్ పద్ధతి(దోస్త్) ద్వారా ప్రవేశం పొందాలన్నారు. తెలుగు ద్వితీయ భాషగా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఎఏ కోర్సుకు అర్హులని వెల్లడించారు. ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నత చదువులు పూర్తి చేయాలనుకునే వారికి సాయంత్రం 5 గంటల నుండి 9వరకు జరగనున్న తరగతులకు హాజరు కావచ్చని అన్నారు. వివరాలకు 9441085114, 9032812971 నెంబర్ లలో సంప్రదించాలని చెన్నయ్య సూచించారు.