మూసీ బాధితులకు అండగా ఉంటాం..
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్, అనుబంధ సంఘాలన్నీ ఉద్యమాలు ప్రారంభించాయని అత్తాపూర్ డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అప్పారెడ్డి ముఖేశ్, పుప్పాల లక్ష్మణ్, పాశం నరేందర్‌రెడ్డిలు అన్నారు.
- ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమం
- లక్షన్నర కోట్ల స్కామ్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ పోరుబాట
- అత్తాపూర్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు
మైలార్‌దేవ్‌పల్లి, ఏప్రిల్ 5: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్, అనుబంధ సంఘాలన్నీ ఉద్యమాలు ప్రారంభించాయని అత్తాపూర్ డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అప్పారెడ్డి ముఖేశ్, పుప్పాల లక్ష్మణ్, పాశం నరేందర్‌రెడ్డిలు అన్నారు. మూసీ పేరుతో రేవంత్ సర్కార్ లక్షన్నర కోట్ల స్కామ్‌కు తెరలేపిందని, దీనికి వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం అత్తాపూర్ డివిజన్, భరత్‌నగర్‌లో మూసీ బాధితులను కలిసి భరోసా కల్పించా రు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూసీపై కాంగ్రెస్ కుట్రను ఎండగడదాం… రేవంత్ సర్కార్ దోపిడీని అడ్డుకుందాం.. అనే నినాదంతో బీఆర్ఎస్వీ పోరుబాట కార్యక్రమాన్ని చేపడుతున్నదన్నారు. మూసీ బాధితులకు అండగా ఉం టూ వారికి భరోసా కల్పిస్తున్నామన్నారు. ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. రానున్న రోజుల్లో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖా యమని, అప్పుడు ప్రజల సమస్యలు పరిష్కారం అ వుతాయన్నారు.
రూ.16,634 కోట్ల వ్యయంతో పూర్తయ్యే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ రూ. లక్షన్నర కోట్లకు ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధంకాకముందే పేదల ఇళ్లను ఎందుకు కూలుస్తున్నారన్నారు. మూసీ బ్యూటిఫికేషన్ పేరిట లక్షల మందిని నిరాశ్రుయులను చేయడం న్యాయమేనా నిలదీశారు. బ్లాక్ లిప్టెడ్ కంపెనీకి రూ.160 కోట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టింది కేవలం ఏఐ గ్రాఫిక్స్ కోసమేనా అన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఎన్ని కుట్రలు చేసి నా వాటికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఉద్యమించడం ఖా యమన్నారు. మూసీ బాధితులకు అండగా ఉంటూ వారి పక్షాన పోరాడుతామని వారు స్పష్టం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

