హైదరాబాద్ : మూడు నెలల క్రితం చర్లపల్లిలో ఇద్దరు పిల్లలతో కలిసి రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయారెడ్డి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. తన భార్య కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఆశ్రయించాడు. తన భార్యా పిల్లలు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాళ్లు కాదని, ఆమె కుటుంబ సభ్యుల వేధింపుల వల్లనే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారని సురేందర్ రెడ్డి ఆరోపించారు.
వాళ్లు చనిపోయిన కొద్దిరోజులకే ఆమె కుటుంబ సభ్యులు ఆస్తుల కోసం తనను వేధించారన్నారు. మా అత్త పుష్పలత, బావమరిది చిరంజీవి నమ్మించి మోసం చేశారన్నారు. ఆస్తికోసంమే నా కుటుంబాన్ని నాకు కాకుండా చేశారని పేర్కొన్నారు. భార్య పిల్లలు చనిపోయిన బాధలో నేనుంటే.. 25 రోజులకే నన్ను బెదిరించారు. అందుకే నకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు.