ఎల్బీనగర్ చౌరస్తాలో నిర్మించిన మరో ఫ్లై ఓవర్ తుదిమెరుగులు దిద్దుకుంటున్నది. ఎస్సార్డీపీలో భాగంగా 22.55 కోట్ల వ్యయంతో 760 మీటర్లు పొడవుతో 12 మీటర్ల వెడల్పుతో చేపట్టిన నిర్మాణం దాదాపుగా పూర్తయింది. వనస్థలిపురం నుంచి వచ్చే వాహనాలు జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ ఎక్కి నేరుగా ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ ముందు రోడ్డు దిగేలా వంతెనను నిర్మించారు. తుది దశ పనుల్లో భాగంగా ప్రస్తుతం ఈ వంతెనపై వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. పెయింటింగ్, బీటీ మ్యాచింగ్ పనులు జరుగుతున్నాయి. నెలాఖరులో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ వంతెనను ప్రారంభించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. – సిటీబ్యూరో/ఎల్బీనగర్, జనవరి16