సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ ) : ప్రజావాణిలో వచ్చిన విన్నపాలను సత్వరమే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కమిషనర్‌కు తమ అర్జీలను అందజేశారు. ప్రజల విన్నపాల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను ఆదేశించారు.
ప్రతి అర్జీదారుడు సమస్య పరిష్కారం కోసం తిరిగి అదే సమస్య విన్నవించకుండా హెచ్ఓడీలు కృషి చేయాలన్నారు. ప్రజావాణికి 66 విన్నపాలు రాగా అందులో టౌన్‌ప్లానింగ్ విభాగానికి 32, ట్యాక్స్, శానిటేషన్ విభాగాలకు 8 చొప్పున, ఇంజినీరింగ్ విభాగానికి 5, యూబీడీ విభాగం 3, వెటర్నరీ, కూకట్పల్లి జోన్, విజిలెన్స్, ఎల్డబ్ల్యూఎస్, అడ్మిన్, ఎస్టేట్, ఫైనాన్స్ విభాగాలకు ఒకటి చొప్పున ఫిర్యాదులు అందగా, ఫోన్ ఇన్ ద్వారా మూడు పిర్యాదులు అందినట్లు అధికారులు పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 93 అర్జీలు వచ్చాయని, కూకట్పల్లి , సికింద్రాబాద్ జో న్లలో 33 చొప్పున, శేరిలింగంపల్లి జోన్లో 18, ఎల్బీనగర్ జోన్, చార్మినార్ జోన్లలో నాలుగు చొప్పున, ఖైరతాబాద్ జోన్లో ఒక ఫిర్యాదు అందినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు పంకజ, గీతా రాధిక, సత్యనారాయణ, వేణుగోపాల్, మంగతాయారు, సీఈ రత్నాకర్, హౌసింగ్ సీఈ నిత్యానంద, డిప్యూటీ కలెక్టర్ భూసేకరణ విభాగం రామ్ నాయక్,అడిషనల్ సీసీపీలు గంగాధర్, వెం కన్న, ప్రదీప్, చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ పద్మజ పాల్గొన్నారు.
నమ్మకం కలిగించాలి..
ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరిస్తూ ప్రజావాణిపై నమ్మకం కలిగించే బాధ్యత అధికారులదేనని అదనపు కలెక్టర్ కదివరన్ పలని అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూం ఇండ్ల దరఖాస్తులే ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. హౌసింగ్ 62, రెవెన్యూ 30, పిం ఛన్లు 44, ఇతర దరఖాస్తులు 26తో కలిపి మొత్తం 162 అర్జీలు వచ్చినట్లు తెలిపారు.