హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేవి అన్నీ బ్రోకర్ మాటలని ఓ వృద్ధుడు విమర్శించారు. ఉపఎన్నికలు జరుగనున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన వృద్ధుడిని ప్రశ్నించగా.. ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు వర్షం కురిపించారు. వృద్ధులు, వితంతువుల పెన్షన్ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతానని చెప్పి మాటతప్పాడని, పైగా ఈ నెల ఇవ్వాల్సిన పెన్షన్ను వచ్చే నెల, వచ్చే నెల పెన్షన్ను పైవచ్చే నెల ఇస్తున్నారని ఆరోపించారు. ఆడవాళ్లకు రూ.2500 ఇస్తానని ఇవ్వడం లేదన్నారు.
ఆడవాళ్లకు ఫ్రీ టికెట్లు ఇచ్చి, మగవాళ్ల నుంచి డబుల్ వసూలు చేస్తున్నారని ఆ వృద్ధుడు మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి మగవాళ్లు ఓటు వేయలేదా..? అంటూ ఘాటు వ్యాఖ్య చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తావు..? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా మాగంటి గోపీనాథ్ సతీమణికే వేస్తానని చెప్పారు. ఆయన నియోజవర్గంలో చాలా మంచి పనులు చేశారని అన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని ప్రశ్నించగా.. బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని అన్నారు. వృద్ధుడి మాటలను కింది వీడియోలో మీరు కూడా వినవచ్చు..
రేవంత్ రెడ్డివి అన్ని బోకర్ మాటలు
మహిళలకు ఫ్రీ బస్ పెట్టి మా దగ్గర డబుల్ పైసలు వసూలు చేస్తున్నాడు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపినాథ్ చాలా మంచి పనులు చేశాడు, మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది pic.twitter.com/WHRK1ssjsc
— Telugu Scribe (@TeluguScribe) October 13, 2025