కొండాపూర్ : ‘ క్యాన్సర్ ( Cancer ) భయం వద్దు అవగాహన ఉంటే విజయం మనదే’ అంటూ హైటెక్ సిటీ మెడికవర్ ( Medicover ) క్యాన్సర్ ఇన్సిటిట్యూట్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఆదివారం బైక్ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో 100 మంది మహిళా రైడర్లు పాల్గొని క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు.

ర్యాలీని మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ టీ సాయి మనోహర్, ఇండియా గ్లోబల్ అంబాసిడర్ మిజాలీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెల్మెట్ ధరించి ప్రయాణించడం మన ప్రాణాలకు రక్షణయితే, మహిళలు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోవడం ద్వారా క్యాన్సర్ నుంచి రక్షించుకోగలమన్నారు. కార్యక్రమంలో వైద్యులు, బెత్సాహిక రైడర్లు పాల్గొన్నారు.