కాచిగూడ, అక్టోబర్ 26 : అంబర్‌పేట నియోజకవర్గంలో ప్రత్యర్థుల అంచనాలకు అందకుండా కారు దూసుకుపోతుంది. అంబర్‌పేట బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌కు బుధవారం ప్రజలు, యువకులు, మహిళలు బ్రహ్మరథం పడుతూ ఏకగ్రీవ తిర్మానాలతో ప్రచారంలో స్థానికులు పాల్గొనడం విశేషం. ఒక్క మాట లో చెప్పాలంటే నియోజకవర్గంలోని అన్ని పార్టీలకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో మొదటిస్థానంలో ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థికి డివిజన్లోని నింబోలిఅడ్డా, బండల్బస్తీ, మౌలానా ఆజాద్‌నగర్ తదితర ప్రాంతల్లోని ఏ బస్తీ, కాలనీకి వెళ్లిన మహిళలు, యువకులు మంగళహారతులతో బ్రహ్మరథం పడుతూ ఆదరిస్తున్నారు.
సీఎం కేసీఆర్ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం అంబర్‌పేట అభ్యర్థి గెలుపు సులువుగా మారిందని మహిళలు, ప్రభుత్వ సంక్షేమ ఫలాల లభ్ధిదారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొంత మంది లబ్థిదారులు కేసీఆర్ పుణ్యమా అంటూ గత ప్రభుత్వాల కంటే ప్రస్తుతం కడుపునిండా తింటూ, కంటినిండా నిద్ర పోతున్నామని వృద్ధులు, డబుల్ బెడ్రూమ్ల లబ్థిదారులు అభ్యర్థి కాలేరు వెంకటేశ్‌తో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. డివిజన్లోని ఏ బస్తీకి వెళ్లినా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రచారాన్ని వివిధ రూపల్లో అస్త్రంగా మా రుస్తూ ప్రభుత్వం అమలు చేస్తు న్న అనేక సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు.
అదే విధంగా టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ ప్రజలందరితో మమేకమవుతూ ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తుండడంతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇతర పార్టీల కార్యకర్తలందరూ రాజకీయాలకు ఆతీతంగా బీఆర్ఎస్ ప్రచారంలో పాల్గొనడం పార్టీకి కొండంత బలం చేకూరింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఎర్రభీష్మాదేవ్, సునీల్బిడ్లాన్, రవీందర్‌యాదవ్, డాక్టర్ శిరీషాయాదవ్, ఓం ప్రకాశ్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి సదానంద్, ధాత్రిక్ నాగేందర్బాబ్జి, బి.కృష్ణాగౌడ్, ఎల్.రమేశ్, మహేశ్‌కుమార్, పట్లూరి సతీశ్, టి.పల్లవి, ప్రతిభ, సరిత, బబ్లూ, అశోక్, అంటోని, తుమ్మల నర్సింహారెడ్డి, యూసుఫొద్ధీన్, మున్నాసింగ్, కిశోర్, బబ్బితో పాటు స్థానికులు పాల్గొన్నారు.