Mahankali Temple | సిటీబ్యూరో, ఆగస్ట్ 24(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో ఆషాఢ మాసంలో జరిగే బోనాల వేడుకలకు పెట్టింది పేరు ఆ ఆలయం. అక్కడ జరిగే ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు. బోనాలు, దసరా ఉత్సవాల్లో అమ్మవారి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతాయి. భాగ్యనగరంతో పాటు పలు ప్రాంతాలకు చెందిన భక్తులకు అమ్మవారు ఇలవేల్పుగా ఉంది. అయితే ఆలయంలో జరిగే ఆచార వ్యవహారాలు కూడా పూర్తిగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతాయి. కానీ ఇప్పుడు ఆ ఆలయంలో అపచారం జరిగిందనే చర్చ జరుగుతున్నది. ఆలయ ప్రాంగణంలోనే జంతుబలి జరిగిందని భక్తులు చెప్పుకుంటున్నారు.
ఆదివారం ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయంలో వంటలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించడంతో ఏమిటని ఆరాతీస్తే అర్ధరాత్రి జరిగిన తంతు బయటపడిందని వారు చర్చించుకుంటున్నారు. శనివారం అర్ధరాత్రి సమయంలో ఆలయంలో మాత గుడి వద్ద మేకపోతును బలి ఇచ్చినట్లుగా భక్తుల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆలయ ప్రాంగణంలో జంతుబలి నిర్వహించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి అమావాస్య సందర్భంలో ఆలయంలోని రంగం జరిగే మాతగుడి వద్ద మేకపోతును బలిఇచ్చినట్లు ఆలయంలో ప్రచారం జరుగుతున్నది. ఆలయానికి చెందిన ఒక వ్యవస్థాపక ముఖ్యుడు, అర్చక , ఉద్యోగులతో కలిసి ఈ తంతుకు పాల్పడినట్లుగా ఆలయవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
అమ్మవారికి కూష్మాండ బలి ఇవ్వడం ఆచారంగా వస్తుండగా ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఏకంగా మేకపోతు బలి ఇవ్వడమేమిటంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బలి ఇచ్చిన వ్యక్తులు అదే ఆలయంలో వెనకవైపు బజార్‌కు వెళ్లే దారిలో వంటచేసుకుని తిన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఈ బలి వ్యవహారంలో ఆలయంలో బోనాల సమయంలో పనిచేసిన కార్మికులతో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నట్లుగా చెప్పుకుంటున్నారు. ముందు అమ్మవారి వద్దకు రెండు మేకపోతులు తెచ్చిన వ్యక్తులు అందులో ఒకటి అమ్మవారికి చూపించి వంటవండే ప్రాంతానికి తీసుకెళ్లగా.. మరొకటి అక్కడే బలి ఇచ్చారని, ఈ సమయంలో ఆలయ ప్రధాన వ్యక్తులు అందరూ అక్కడే ఉన్నట్లుగా ఆలయంలో చర్చించుకుంటున్నారు. ఈ తంతు అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉంటుందని, ఒకవేళ ఆసమయంలో బంద్ చేసి ఉంటే వెనక వైపు ఉండే పోలీస్‌స్టేషన్ సీసీ ఫుటేజ్‌లో కొన్ని దృశ్యాలు దొరికే అవకాశముంటుందని ఆలయవర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఇదే వ్యవహారంపై ఆలయ కార్యనిర్వహణాధికారిని సంప్రదిస్తే తమ ఆలయంలో జంతుబలి నిషేధమని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఇటువంటి బలులకు సంబంధించి ఆలయాల బయట లేదా ఆలయానికి సంబంధం లేకుండా ఉన్న ఆలయ కమర్షియల్ కాంప్లెక్స్‌లలో జంతుబలి ఇవ్వడం జరుగుతున్నదని, కానీ అమ్మవారి ఆలయంలో శనివారం అర్ధరాత్రి ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ తంతుపై దేవాదాయఅధికారులు ఎలా స్పందిస్తారో చూడాలంటూ ఆలయ భక్తులు చర్చించుకుంటున్నారు. అమ్మవారికి కూష్మాండ బలి ఇవ్వడం ఆచారంగా వస్తుండగా ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఏకంగా మేకపోతు బలి ఇవ్వడమేమిటంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బలి ఇచ్చిన వ్యక్తులు అదే ఆలయంలో వెనకవైపు బజార్‌కు వెళ్లే దారిలో వంటచేసుకుని తిన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఈ బలి వ్యవహారంలో ఆలయంలో బోనాల సమయంలో పనిచేసిన కార్మికులతో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నట్లుగా చెప్పుకుంటున్నారు.
ముందు అమ్మవారి వద్దకు రెండు మేకపోతులు తెచ్చిన వ్యక్తులు అందులో ఒకటి అమ్మవారికి చూపించి వంటవండే ప్రాంతానికి తీసుకెళ్లగా.. మరొకటి అక్కడే బలి ఇచ్చారని, ఈ సమయంలో ఆలయ ప్రధాన వ్యక్తులు అందరూ అక్కడే ఉన్నట్లుగా ఆలయంలో చర్చించుకుంటున్నారు. ఈ తంతు అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉంటుందని, ఒకవేళ ఆసమయంలో బంద్ చేసి ఉంటే వెనక వైపు ఉండే పోలీస్‌స్టేషన్ సీసీ ఫుటేజ్‌లో కొన్ని దృశ్యాలు దొరికే అవకాశముంటుందని ఆలయవర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఇదే వ్యవహారంపై ఆలయ కార్యనిర్వహణాధికారిని సంప్రదిస్తే తమ ఆలయంలో జంతుబలి నిషేధమని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఇటువంటి బలులకు సంబంధించి ఆలయాల బయట లేదా ఆలయానికి సంబంధం లేకుండా ఉన్న ఆలయ కమర్షియల్ కాంప్లెక్స్‌లలో జంతుబలి ఇవ్వడం జరుగుతున్నదని, కానీ అమ్మవారి ఆలయంలో శనివారం అర్ధరాత్రి ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ తంతుపై దేవాదాయఅధికారులు ఎలా స్పందిస్తారో చూడాలంటూ ఆలయ భక్తులు చర్చించుకుంటున్నారు.