విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి రెండు ప్రాణాలు బలి
వర్షం బీభత్సానికి చెట్లు కూలడంతో తెగిన విద్యుత్ తీగలు తగిలి తండ్రీ కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపురం డివిజన్ టెలికాం కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి కాలనీలో ఓ భారీ చెట్టు కూలిపోయింది.
- కారును పక్కకు తీసేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో తండ్రీకూతురు మృతి
అల్వాల్, జూన్ 13 : వర్షం బీభత్సానికి చెట్లు కూలడంతో తెగిన విద్యుత్ తీగలు తగిలి తండ్రీ కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపురం డివిజన్ టెలికాం కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి కాలనీలో ఓ భారీ చెట్టు కూలిపోయింది.
కారు పక్కనే చెట్టు పడటంతో వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు సందీప్ (45), అతని కూతురు ప్రీతిక (17) బయటకు వచ్చారు. అయితే తెగి పడిన విద్యుత్ తీగలు తగలడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు గమనించి పోలీసులకు, విద్యుత్ శాఖకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అల్వాల్ పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
అధికారులపై స్థానికుల ఆగ్రహం
వర్షం పడిన వెంటనే లైన్లను పరిశీలించకుండా తెగిపడిన తీగలపై విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కాలనీవాసులు మండిపడ్డారు. శిథిలావస్థలో ఉన్న చెట్లను ముందే తొలగించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆ దుకోవాలని కోరారు. బాధులైన విద్యు త్ అధికారులను వెంటనే సస్పెం డ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

