అంబర్‌పేట : మేదర సంఘం ఆత్మగౌరవ భవనం భూమి పట్టాలు అందజేయటం పై ఆ సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు.
ఎంసీఆర్‌హెచ్చార్డీలో మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతులమీదుగా సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్రాముడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కె.మురళీకృష్ణ, గౌరవాధ్యక్షుడు పి.బాలరాజు, ప్రధాన కార్యదర్శి జొరీగల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు జె.శ్రీధర్, పుట్ట యాదగిరిలు పట్టాను అందుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కుల సంఘానికి ఉప్పల్ భగాయత్‌లో ఆత్మగౌరవ భవనం కోసం ఎకరా స్థలం, కోటి రూపాయలు కేటాయించడం పట్ల సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని కొనియాడారు.