బడ్జెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ.. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ ఆధ్వర్యంలో ఆదివారం సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. పికెట్ చౌరస్తాలో అంబేద్కర్, జగ్జీవన్రాం విగ్రహాలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ డిక్లరేషన్లకు సంబంధించిన పత్రాలను సమర్పించి.. ప్లకార్లులు ప్రదర్శిసూ..ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కామారెడ్డి డిక్లరేషన్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్, ఏటా బడ్జెట్లో 20వేల కోట్లు కేటాయింపు అని ప్రకటించారని.. 42 శాతం రిజర్వేషన్లు, 20వేల కోట్లు ఎక్కడ అని ప్రశ్నించారు. అంతకుముందు సీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తున్న సమయంలో మారేడ్పల్లి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.రాహుల్ గాంధీకి తెలంగాణ సమస్యలు పట్టవని, పార్లమెంట్లో నిసిగ్గుగా 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
– కంటోన్మెంట్, మార్చి 22