Ram Charan | సర్జరీ విజయవంతం.. కోయంబత్తూరులో అయ్యప్పకు ప్రత్యేక పూజలు చేసిన రామ్ చరణ్ దంపతులు!
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిన అనంతరం, ఆయన తన సతీమణి ఉపాసన కొణిదెలతో కలిసి కోయంబత్తూరులోని ప్రసిద్ధ అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించారు.
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిన అనంతరం, ఆయన తన సతీమణి ఉపాసన కొణిదెలతో కలిసి కోయంబత్తూరులోని ప్రసిద్ధ అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించారు. కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్లో తన మణికట్టుకు విజయవంతంగా సర్జరీ ముగిసి డిశ్చార్జ్ అయిన వెంటనే, ఆయన నేరుగా ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దంపతులు ఇద్దరూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్తిగా నలుపు రంగు దుస్తుల్లో కనిపిస్తూ, రామ్ చరణ్ తన కుడి చేతికి కట్టుతో ఆలయానికి వెళ్లారు. ఈ విజిట్లో భాగంగా ఉపాసన ఆవుకు అరటిపండ్లు తినిపిస్తూ కనిపించగా, దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ మణికట్టుకు గాయం కాగా, మెరుగైన వైద్యం కోసం ఆయన కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో చేరారు. ఈ ఆపరేషన్ సమయంలో ఆయన వెంట భార్య ఉపాసన ఉన్నట్లు సమాచారం. ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్ రాజశేఖరన్ నేతృత్వంలో ఈ సర్జరీ విజయవంతమైంది. గాయం తీవ్రత దృష్ట్యా మయామికి చెందిన ప్రసిద్ధ హ్యాండ్ అండ్ రిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ అలెజాండ్రో బాడియా కూడా ఈ శస్త్రచికిత్స నిపుణుల బృందంలో భాగమయ్యారు. డాక్టర్ రాజశేఖరన్, డాక్టర్ బాడియా, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్ తదితరుల బృందం ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసింది.
ప్రస్తుతం రామ్ చరణ్ ఆరోగ్యంగా ఉన్నారని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. అయితే పూర్తిగా కోలుకోవడానికి ఆయనకు సుమారు ఎనిమిది వారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. వైద్యుల నుంచి పూర్తి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే ఆయన మళ్లీ షూటింగ్లలో పాల్గొనే అవకాశం ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే, రామ్ చరణ్ చివరిగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో జాన్వీ కపూర్ సరసన నటించిన ‘పెద్ది’ చిత్రంలో కనిపించారు. ఈ విశ్రాంతి సమయం ముగిసిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తన తదుపరి చిత్ర షూటింగ్లో ఆయన పాల్గొననున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

