BSE Sensex : భారత స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల్లో ముగిసింది. బెంచ్‌మార్క్ 1 శాతం పెరిగింది. ఐటీ, మెటల్ స్టాక్స్‌లో కొనుగోళ్ల జోష్ పెరగడంతో మార్కెట్ లాభాలబాట పట్టింది. బీఎస్ఈ సెన్సెక్స్ 88 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 264 పాయింట్లు పెరిగాయి. ట్రేడింగ్ ఈ రోజు 77,765.49 పాయింట్ల గరిష్టాన్ని చేరగా, 77,333.24 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. చివరకు 888.68 పాయింట్ల లాభం (1.16 శాతం)తో 76,654.60 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 264.85 పాయింట్లు (1.1 శాతం) లాభపడి 24,250.20 వద్ద ముగిసింది.
బీఎస్ఈ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 50.16 పాయింట్లు, బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 102.92 పాయింట్లు లాభపడ్డాయి. నిఫ్టీ ఐటీ షేర్లు 2.32 శాతం, నిఫ్టీ రియాల్టీ షేర్లు 2.31 శాతం లాభపడ్డాయి. అలాగే, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ షేర్లు కూడా భారీ లాభాల్లో ముగిశాయి. హిందుస్తాన్ యునిలీవర్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, ట్రెంట్, లార్సెన్ అండ్ టర్బో భారీ లాభాల్లో ముగిశాయి. వీటిలో హిందుస్తాన్ యునీలీవర్ 4.70 శాతం లభపడింది. మరోవైపు అదానీ పోర్ట్స్, బీఈఎల్, ఎంఅండ్ఎం, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ నష్టాల్లో ముగిశాయి. అందులో అదానీ పోర్ట్స్ షేర్లు 3.19 శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 30 షేర్లలో 25 షేర్లు బుధవారం లాభాల్లోనే ముగిశాయి.
50 నిఫ్టీ షేర్లలో 38 షేర్లు లాభాల్లో ముగిశాయి. 12 మాత్రమే నష్టాలు చవిచూశాయి. డాలర్‌తో రూపాయి మారక విలువ బుధవారం 0.11 శాతం లాభపడి, 95.62 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 87.65 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్స్ ధర 4,031.84 డాలర్ల వద్ద కొనసాగుతోంది.