Neymar | ఫుట్‌బాల్ బ్రెజిల్ (Brazil) జాతీయ జట్టుకు వీడ్కోలు పలుకుతున్నట్లు దిగ్గజ క్రీడాకారుడు నెయ్మార్ (34) జూనియర్ తెలిపాడు. 16 ఏండ్ల కెరీర్ నుంచి రిటైర్ అవుతున్నట్లు అతడు అధికారికంగా బుధవారం వెల్లడించాడు. బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా అతడు రికార్డు నెలకొల్పాడు. ఫిఫా (FIFA) వరల్డ్ కప్-2026లో లీగ్ దశలో బ్రెజిల్ నార్వే చేతిలో 2-1 తేడాతో ఓడిపోయింది. దీంతో వరల్డ్ కప్ నుంచి బ్రెజిల్ నిష్క్రమించింది. అప్పుడు జాతీయ జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
దేశం తరఫున చెమటోడ్చాను, పసుపు రంగు జెర్సీ వేసుకొని పోరాడాను. ఇక ఆ జెర్సీని ధరించను అని అన్నాడు. ఫుట్‌బాల్ ప్రపంచకప్, కోపా అమెరికా, ఒలింపిక్స్‌లలో ఆడాడు. కోపా సుండామెరికానా టోర్నీలో శాంటోస్ (Santos) క్లబ్ తరఫున ఆడగా 4-2 తేడాతో యూనివర్సిడాడ్ సెంట్రల్ జట్టు ఓడిపోయింది. ఈ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో
సహచర యువ ఆటగాళ్లను వెక్కిరించి, బెదిరించాడని వచ్చిన వార్తలను అతడు ఖండించిన సందర్భంగా జాతీయ జట్టుకు రిటైర్మెంట్ను ప్రకటించాడు.
నెయ్మార్ జూనియర్ బ్రెజిల్ జాతీయ జట్టు తరఫున 2010లో అరంగేట్రం చేశాడు. 2013 ఫిఫా వరల్డ్ కప్‌లో విజయం సాధించడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. 2016 రియో ఒలింపిక్స్ (Rio Olympics)లో స్వర్ణం సాధించి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. బ్రెజిల్ తరఫున నెయ్మార్ 130 మ్యాచ్‌లు ఆడి 80 గోల్స్ సాధించాడు.