CMA Results | సిటీబ్యూరో, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): సీఎంఏ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థిని కె.తేజస్విని ఆల్ ఇండియా మొదటి ర్యాంకు సాధించింది. ఈ మేరకు మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ద ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సీఎంఏ ఫలితాల్లో కొత్తపేట తేజస్వినికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు వచ్చిందని తెలిపారు. తేజస్విని స్వస్థలం అన్నమయ్య జిల్లాలోని కన్నెమడుగు గ్రామం. ఆమెది సాధారణ రైతు కుటుంబం. సీఏ ఫైనల్ ఫలితాల్లో కూడా ఆల్ ఇండియా 14వ ర్యాంకు సాధించారని పేర్కొన్నారు. తేజస్విని విద్యాభ్యాసం కూడా జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగింది. ఇంటర్, ఎంఈసీ నుంచి సీఏ ఫైనల్ వరకు తేజస్విని మాస్టర్ మైండ్స్‌లో చదువుకున్నారని చెప్పారు.