చర్లపల్లి, సెప్టెంబర్ 23 : చర్లపల్లి డివిజన్, కుషాయిగూడ డీమార్ట్‌లో కుళ్లిపోయిన పండ్లు, పుచ్చుపోయిన పప్పులు విక్రయిస్తున్నారంటూ శివసాయినగర్కు చెందిన కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. శివసాయినగర్కు చెందిన చంద్రశేఖర్ శుక్రవారం డీమార్ట్‌లో లయన్ డేట్స్‌తో పాటు వస్తువులను కొనుగోలు చేశారు. కాగా.. అందులోనే చంద్రశేఖర్ లయన్ డేట్స్ ప్యాకెట్‌ను ఓపెన్ చేయగా.. అందులో పురుగులు వచ్చాయి. వెంటనే అతను డీమార్ట్ ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి, సీసీఎస్ ప్రతినిధి పద్మారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. అతను సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్, సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ స్వప్ణారెడ్డిలకు సమాచారం అందించారు. వెంటనే ఏఎంహెచ్ఓ స్వప్నారెడ్డి.. డీమార్ట్‌కు వచ్చి మొత్తం తనిఖీ చేసి.. లయన్ డేట్స్ ప్యాకెట్‌ను ఓపెన్ చేసి .. రూ.3వేల జరిమానా విధించారు.
వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సర్కిల్ ఏఎంహెచ్ఓ డాక్టర్ స్వప్నారెడ్డి హెచ్చరించారు. కుషాయిగూడ శివసాయినగర్లోని డీమార్ట్‌ను సందర్శించి తనిఖీలు నిర్వహించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని, మోసపూరితంగా ప్యాకింగ్ చేసి విక్రయిస్తే తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ సిబ్బంది, శివసాయినగర్ సంక్షేమ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.