Moinabad | మొయినాబాద్, ఏప్రిల్ 9 : హైదరాబాద్ నగరంలోని బోరబండ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహ్మద్ లుఖ్మార్ తన బర్త్‌డే వేడుకలను నగర శివారులోని మొయినాబాద్ మండల పరిధి ఎతుబార్పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని హాలిడే హోమ్ హౌస్‌లో మంగళవారం రాత్రి జరుపుకొన్నారు. బర్త్‌డే పార్టీ ముసుగులో ముజ్రా పార్టీని కూడా ఏర్పాటు చేశారు.
ఈ పార్టీలో పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ర్టాలకు చెందిన ఏడుగురు యువతులు, 13 మంది యువకులను మద్యం, గంజాయి మత్తులో దింపి.. వారితో అర్ధ నగ్న నృత్యాలు, అశ్లీల, అసాంఘిక కార్యక్రమాలను నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు ఎస్వోటీ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా ముజ్రా పార్టీ శిబిరంపై దాడులు చేసి 70 గ్రాముల గంజాయి, రూ.19వేలు, ఆరు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ యజమానితోపాటు పార్టీలో పాల్గొన్నవారిని బుధవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు.
ఓ అసభ్యకర పార్టీ ఘటన వెలుగులోకి వచ్చింది. ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నారని, గంజాయి మత్తు ఎక్కించి అర్ధనగ్న నృత్యాలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఎస్వోటీ, స్థానిక పోలీసులు సంయుక్త దాడులు నిర్వహించారు.
ఈ ఘటన మొయినాబాద్ మండల పరిధిలోని ఎతుబార్పల్లి రెవెన్యూ పరిధిలో కలకలం రేపింది. సీఐ పవన్‌కుమార్ రెడ్డి తెలిపిన వివరాలు.. హైదరాబాద్ నగరంలోని బోరబండకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహ్మద్ లుఖ్మాన్ తన బర్త్‌డే వేడుకలను ఎతుబార్పల్లి శివారులో ఉన్న హాటీడే హోమ్ ఫామ్ హౌజ్‌లో జరుపుకోవడానికి మంగళవారం సాయంత్రం ఏర్పాట్లు చేసుకున్నారు. బర్త్‌డే పార్టీ ముసుగులో ముజ్రా పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.
ఈ పార్టీలో పశ్చిమ బెంగాల్‌తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన ఆరు గురు యువతులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి మహ్మద్ లుఖ్మాన్తో పాటు 12మంది స్నేహితులు హాజరయ్యారు. ముజ్రా పార్టీకి ఆరు గురు యువతులను డి.బాబు, రీనా తీసుకొచ్చారు. యువతీ, యువకులకు మద్యం, గంజాయి మత్తెక్కించి అర్ధనగ్నంగా అశ్లీల నృత్యాలు చేయించారు. అసాంఘిక కార్యకలాపాలు సైతం నిర్వహించారు. ఈ విషయమై రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందింది.
వెంటనే స్థానిక పోలీసులతో కలిసి రాత్రి 11.30 గంటలకు ముజ్రా పార్టీ శిబిరంలో దాడులు నిర్వహించి పార్టీని భగ్నం చేశారు. పోలీసులు వెళ్లిన సమయంలో కూడా అశ్లీల నృత్యాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు సేకరించి బుధవారం తెల్లవారు జామున 3.30 గంటలకు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. యువతీయువకులతో పాటు బర్త్‌డే చేసుకున్న మహ్మద్ లుక్మాన్, ఫామ్ హౌస్ యాజమాని అబ్దుల్ బీన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
మద్యం, గంజాయి స్వాధీనం
ముజ్రా పార్టీలో ఆశ్లీల నృత్యాలు చేయడానికి యువతీయువకులను మత్తెక్కించడానికి మద్యం, గంజాయిని తాగించారు. ఆ మత్తులో తూగుతూ.. ఊగుతూ డీజే హోరులో ఆశ్లీల నృత్యాలు చేస్తున్నారు. పోలీసులు ఒక్కసారిగా దాడులు నిర్వహించడంతో ఉలిక్కిపడ్డారు. వాళ్లు తెచ్చుకున్న మద్యం, గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 70 గ్రాముల గంజాయి, రూ.19వేల నగదు, 15 నిరోద్ ప్యాకెట్లు, ఆరు వాహనాలతో పాటు మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. దర్యాప్తులో భాగంగా సీఐ పవన్‌కుమార్ ఆద్వర్యంలో ముజ్రా పార్టీ నిర్వహించిన తీరుపై పూర్తి వివరాలు సేకరించారు.