విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలంటూ.. శనివారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చలో సెక్రటేరియట్ చేపట్టారు.
ఈ సందర్భంగా సచివాలయం ముట్టడికి వెళ్తున్న విద్యార్థులను బీఆర్కే భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా అరెస్టు చేసి.. తీసుకెళ్లారు. పోలీసులు విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి.