బంజారాహిల్ ్స, డిసెంబర్ 26: అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఎల్బీనగర్కు చెందిన కాజీపేట వీక్షిత్ తన స్కోడా కారులో జూబ్లీహిల్స్ రోడ్ నం. 36 మీదుగా వెళ్తున్నాడు. సరిగ్గా పిల్లర్ నంబర్ 1669 వద్దకు రాగానే వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొట్టడంతో గాలిలోకి ఎగిరిన కారు పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో కారు నడిపిస్తున్న వీక్షిత్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కువగా లేకపోవడంతో ముప్పు తప్పింది. అయితే, రోడ్డుకు అడ్డంగా కారు పడిపోవడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని కారును తొలిగించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.