RGIA | శంషాబాద్ రూరల్, మార్చి 16 : సాంకేతిక సమస్యతో ఎయిర్ ఏషియా విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. కౌలాలంపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన విమానంలో గాల్లో ఉండగానే సాంకేతిక సమస్యను గుర్తించి ఫైలెట్ శంషాబాద్ ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన ఏటీసీ అధికారులు ఎయిర్ ఏషియా విమానం ల్యాండింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయడంతో ఫైలెట్ సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 73 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు తల్లెత్తకుండా సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో అటు ప్రయాణికులు, ఇటు ఎయిర్‌పోర్టు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కాని జీఎంఆర్ అధికారులు మాత్రం అత్యవసరంగా ల్యాండింగ్ కాదు సాధారణంగానే ల్యాండింగ్ చేశారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా ఆ వాస్తవమని ప్రకటించారు.