ముంబైలో భారీ వర్షాలు.. శంషాబాద్లోనే ల్యాండైన విమానం
భారీ వర్షాలు | తౌటే తుపాను కారణంగా ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముంబై విమానాశ్రయాన్ని

హైదరాబాద్ : తౌటే తుపాను కారణంగా ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముంబై విమానాశ్రయాన్ని మూసివేశారు. దీంతో బ్యాంకాక్ నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఏషియా ( XJ218 ) విమానం శంషాద్ ఎయిర్‌పోర్టులోనే ల్యాండ్ అయింది. ముంబైకి వెళ్లాల్సిన పలు విమానాలను శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మళ్లిస్తున్నట్లు సమాచారం.
అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుఫాను పెను తుఫానుగా మారి గుజరాత్‌వైపు పయనిస్తోంది. ఇప్పటికే ఈ తుఫానుతో కేరళ, కర్ణాటక, గోవా తీర ప్రాంతాలు భారీగా దెబ్బతిన్నాయి. గుజరాత్లో పెను విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ తుఫాను ఉత్తర, వాయవ్య దిశగా పయనించి సోమవారం సాయంత్రానికి గుజరాత్ తీరాన్ని తాకి, మంగళవారం తెల్లవారుజామున పోరుబందర్- మహువా (భావ్‌నగర్ జిల్లా) ల మధ్య తీరాన్ని దాటనుందని వెల్లడించింది.
తుఫాను గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో గుజరాత్‌తో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన డామన్ డయ్యూ ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించింది. తుఫాను కారణంగా ప్రచండ గాలులు వీస్తాయని, గాలి వేగం గంటకు 160-185 కి.మీ.కు పెరుగుతుందని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. సోమవారం మహారాష్ట్ర తీర ప్రాంతంలో గాలి వేగం గంటకు 65-75 కి.మీ.; దుమారం వేగం గంటకు 85 కి.మీ. ఉంటుందని పేర్కొంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

