జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 15: యూసుఫ్‌గూడ టీఎస్ఎస్పీ ప్రథమ పటాలంలో గురువారం కమాండెంట్ పి.మురళీకృష్ణ ఆధ్వర్యంలో గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్స్ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు.
ఏఐజీ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ సుజనా ప్రియ, డాక్టర్ చందన, డాక్టర్ అభినవ్, డాక్టర్ తిరుపతి స్వామి, డాక్టర్ రఘుతో పాటు వైద్య సిబ్బంది పాల్గొని వైద్య సేవలందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ నరేందర్ సింగ్, ఇతర అధికారులు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.