హైదరాబాద్ : అత్తాపూర్లో అడ్వకేట్ మహ్మద్ ఖదీర్ దారుణ హత్యకు గురయ్యాడు. సులేమాన్ నగర్లోని తన సొంత ఆఫీసులోనే దుండగులు కత్తులతో పొడిచి చంపి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరరించే పనిలో నిమగ్నమయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి నిందితుల కోసం గాలిస్తున్నారు.
కాగా, కుటుంబ విభేదాల కోణంలో బామ్మర్దులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవలే చేవెళ్లతో అడ్వకేట్ హత్యకు గురవ్వగా ఇప్పుడు ఖదీర్ చనిపోవడంతో న్యాయవాదులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.