Anganwadi | జూబ్లీహిల్స్, జూన్ 10 : అంగన్వాడీ కేంద్రాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా జూన్ 10 నుంచి 17 వరకు అమ్మ మాట.. అంగన్వాడీ బాట కార్యక్రమం చేపట్టనున్నారు. బస్తీలలో ఇంటింటికి వెళ్లి తల్లి ఒడి విడిచిన ఐదేండ్ల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించేందుకు అడ్మిషన్ డ్రైవ్ చేపట్టనున్నారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా ఐదేండ్లు దాటిన అంగన్వాడీ చిన్నారులను పాఠశాలల్లో చేర్పించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం విద్యా శాఖ అధికారులు రహ్మత్ నగర్ డివిజన్లో అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి స్థానిక కేంద్రాల్లో పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని అవగాహన కల్పించారు. కాగా అంగన్వాడీ కేంద్రాలలో ఐదేండ్ల లోపు చిన్నారులను చేర్చుకునేందుకు అమ్మ మాట.. అంగన్వాడీ బాట చేపట్టనున్నారు.