కాచిగూడ, జూలై 15: తెలంగాణ ఉద్యమంలా బీసీ ఉద్యమం వచ్చినప్పుడే బీసీల బతుకులు మారుతాయని విశ్వకర్మ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అడ్లూరి రవీంద్ర చారి అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, రచయిత జూలూరి గౌరీశంకర్ రచించిన బహుజనగణమన పుస్తకాన్ని మంగళవారం రవీంద్ర చారి ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్లోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహం వద్ద ఆవిష్కరించారు.
అనంతరం అడ్లూరి రవీంద్ర చారి మాట్లాడుతూ బీసీలు రాజ్యాధికారులు అవుతారని వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ముందే చెప్పారని ఆయన గుర్తు చేశారు. బీసీలు పాలితులు కాదని, పాలకులుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రఘువీర్, మహారాజా రవీంద్రచారి, పీఎన్ చారి, సంకోజు రాఘవేందర్, జితేందర్, భాస్కరాచారి, తదితరులు పాల్గొన్నారు.