అబిడ్స్, మే 18 : రాష్ట్ర మైనార్టీ కమిషన్లో జైన్ సమాజానికి చెందిన ఒకరిని సభ్యులుగా నియమించాలని తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో జైన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మైనార్టీలుగా ఉన్న జైన్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ వస్తుంది. ఇప్పటికే వారు మైనార్టీలు కాగా మైనార్టీ కమిషన్లో వారిని సభ్యులుగా నియమించాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న దాదాపు రెండులక్షల పైచిలుకు జైన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర మైనార్టీ కమిషన్లో జైన్లను సభ్యులుగా నియమించాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రంలోని జైన్లంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఈ నిర్ణయాన్ని క్యాబినెట్ సమావేశంలో ప్రకటించడం సంతోషకరం. ప్రభుత్వ నిర్ణయానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
-రిదేశ్ జాగిర్దార్ జైన్, ఆలిండియా జైన్ మైనార్టీ ఫెడరేషన్ తెలంగాణ రీజియన్ కన్వీనర్.
తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కమిషన్లో తమ సమాజానికి చెందిన వారిని సభ్యులుగా నియమించాలని రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. సీఎం కేసీఆర్ జైన్ల సంక్షేమానికి పాటు పడుతూ వస్తున్నారు. తాజాగా క్యాబినెట్లో ఈ నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉంది.
– ఆర్కే జైన్, రాజ్నీతి చేతన మంచ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు
ఉత్తర భారతీయులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ ఉత్తర భారతీయుల సంక్షేమానికి పాటు పడుతున్నారు. మైనార్టీ కమిషన్లో జైన్లలో ఒకరిని సభ్యుడిగా నియమించాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని జైన్ల సంక్షేమానికి తమ ప్రభుత్వం పాటు పడుతుంది.
-నందకిశోర్ వ్యాస్ బిలాల్, గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి