Kajal Agarwal | కూకట్పల్లి, మే 4 : ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఆదివారం సందడి చేశారు. కేపీహెచ్‌బీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన గోకులం సిగ్నేచర్ జువెల్స్ కొత్త షోరూంను కాజల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారికి కాజల్ అభివాదం చేసి ఆత్మీయంగా పలకరించారు.
షోరూం ప్రారంభోత్సవం అనంతరం నిర్వాహకులు పొత్తూరి సుబ్బారావు, పొత్తూరి లలితకుమారి, బాబురావు మాట్లాడుతూ.. తెనాలికి గర్వకారణమైన గోకులం సిగ్నేచర్ జువెల్స్ హైదరాబాద్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ షోరూమ్‌కు మంచి స్పందన లభిస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. తమ కస్టమర్లకు నూతన డిజైన్లు, నాణ్యత, మన్నికతో వెండి, వజ్ర ఆభరణాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. గాజులు, మంగళ సూత్రం, వివాహాది శుభకార్యాల కోసం ప్రత్యేక బ్రైడల్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.