5 భాగాలు 9 అంశాలు..
మూసీ నదిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణను రూపొందిస్తోంది. జంట జలశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల కింది భాగం నుంచి ప్రారంభమయ్యే మూసీ, ఈసీ నదుల తీర ప్రాంతం నగరం పరిధిలో సుమారు 59 కి.మీ మేర ప్రవహిస్తోంది.
- మూసీ సుందరీకరణపై మొదలైన కార్యాచరణ
- అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైన్లు
- దేశ, విదేశాల ఆర్కిటెక్టులతో ప్రభుత్వం చర్చలు
సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : మూసీ నదిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణను రూపొందిస్తోంది. జంట జలశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల కింది భాగం నుంచి ప్రారంభమయ్యే మూసీ, ఈసీ నదుల తీర ప్రాంతం నగరం పరిధిలో సుమారు 59 కి.మీ మేర ప్రవహిస్తోంది. ఈ ప్రాంతాన్ని 5 భాగాలుగా గుర్తించారు. అందులో జంట జలాశయాల నుంచి బాపూఘాట్ వరకు, అదేవిధంగా పీర్జాదిగూడ నుంచి గౌరెల్లి బ్రిడ్జి వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్ ఏరియాగా, బాపూఘాట్ నుంచి హైకోర్టు వరకు, చాదర్‌ఘాట్ బ్రిడ్జి నుంచి నాగోల్ బ్రిడ్జి వరకు ఉన్న ప్రాంతాలను నెవర్ డెవలప్‌మెంట్‌గా, హైకోర్టు నుంచి చాదర్‌ఘాట్ బ్రిడ్జి వరకు ఉన్న ప్రాంతాన్ని ఓల్డ్ కోర్ సిటీగా గుర్తించారు.
మూసీ సుందరీకరణకు మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు ‘సిమ్యులేషన్ మోడల్ ఫర్ హైడ్రాలిక్స్ ’ ప్రాజెక్టును రూపొందించేందుకు ఇప్పటికే కన్సల్టెన్సీలను ఆహ్వానించారు. ఇందులో ప్రధానంగా ఎకనామిక్ హబ్, టూరిజం హబ్, ఇంప్రూవ్డ్ యాక్సెసబిలిటీ, ఇంప్రూవ్ క్వాలిటీ లైఫ్, ఎన్విరాన్మెంట్, ఇంప్రూవ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెరిటేజ్ అండ్ కల్చర్ ప్రిజర్వేషన్, ప్రాపర్టీ వాల్యూ అండ్ టాక్సెస్, సిటీ ఇమేజ్ ఇలా పలు అంశాలన్నీ మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో ఉండేలా ప్రతిపాదనలు రూపొందించి, దానికి డిజైన్లు చేసి నిర్మాణం పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం దేశ, విదేశాలకు చెందిన ఆర్కిటెక్టులతోనూ సంప్రదిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

