ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు
పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌కు మద్దతుగా సోషల్‌మీడియాలో వీడియోలు పోస్ట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఇప్పటివరకూ14 మందిపై కేసు నమోదు కాగా, మొత్తం 50మంది వీడియోలను, అభ్యంతరకర కంటెంట్‌ను పోస్ట్ చేసినట్టు గుర్తించారు. సోషల్‌మీడియాలో తమపై వ్యతిరేక ప్రచారం చేయడంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- పోక్సో కేసులో బాధితురాలిపై వ్యతిరేక ప్రచారం చేశారని చర్యలు
జగద్గిరిగుట్ట, మే17: పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌కు మద్దతుగా సోషల్‌మీడియాలో వీడియోలు పోస్ట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఇప్పటివరకూ14 మందిపై కేసు నమోదు కాగా, మొత్తం 50మంది వీడియోలను, అభ్యంతరకర కంటెంట్‌ను పోస్ట్ చేసినట్టు గుర్తించారు. సోషల్‌మీడియాలో తమపై వ్యతిరేక ప్రచారం చేయడంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ గోప్యతకు భంగం కలుగిస్తున్న సోషల్‌మీడియా ఖాతాలలో కంటెంట్ తొలగించడంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
బాధితురాలికి వ్యతిరేక ప్రచారంపైనా జిల్లా చైల్డ్వెల్ఫేర్ ప్రతినిధులు కూడా పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రచారంతో పోలీసులను, ప్రజలను పక్కదారి పట్టించేలా ఉన్న వీడియోలను పోలీసులు ఇప్పటికే కొన్నింటిని గుర్తించారు. అప్లోడ్ చేయడం, వాటిని ఉద్దేశపూర్వకంగా ఎక్కువసార్లు షేర్ చేసినవారి వివరాలను ఆరా తీశారు. పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసిన తర్వాత నుంచి నిందితుడి అరెస్టు వరకూ.. కేసు తీవ్రత తగ్గేలా, బాధితురాలిని తప్పుబడుతూ పలువురు సోషల్‌మీడియా ఖాతాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.
నిందితునికి క్లీన్ ఇమేజ్ ఉన్నట్టు చూపే ప్రయత్నంలో డబ్బులు తీసుకొని ప్రచారం చేసినట్టు అనుమానిస్తున్నారు. నిందితులకు మద్దతుగా ప్రచారం, పోక్సో బాధితుల వివరాలు వెల్లడయ్యేలా చేయడం నేరం, సోషల్‌మీడియాలో పోక్సో కేసులో వ్యతిరేక ప్రచా రం చేసినవారిపై విచారణ చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నదని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

