గుమ్మడిదల, నవంబర్ 25: కాలుష్య కారక పరిశ్రమలను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు మంగళవారం గుమ్మిడిదల తహసీల్ ఎదుట మహాధర్నా చేపట్టారు. కాలుష్య పరిశ్రమలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కేవీపీసీ కన్వీనర్లు మంగయ్య, బాల్‌రెడ్డి, కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలు సంయుక్తంగా మూడు గంటల పాటు ఆందోళన చేశారు. కేవీపీసీ కన్వీనర్ మంగయ్య మాట్లాడుతూ.. నల్లకుంట చెరువు పైభాగంలో ఉన్న రసాయన పరిశ్రమలు వర్షం మాటున వదిలిన వ్యర్థజలాలతో చెరువంతా కలుషితమైందన్నారు.
ఈ చెరువు నీరు కలుషితం కావడంతో పశువులు మృతిచెందుతున్నాయని, పంటలు దెబ్బతింటున్నాయని వాపోయారు. నల్లకుంట నీటి నుంచి శాంపిల్స్‌ను సేకరించిన పీసీబీ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దోమడుగులోని నల్లకుంట కలుషితం కావడానికి కారణమైన పరిశ్రమలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ దోమడుగు కేవీపీసీ సభ్యులు గుమ్మిడిదల తహసీల్దార్ ఎం.పరమేశ్‌కు, గుమ్మిడిదల మున్సిపల్ కమిషనర్ దశరథ్కు ఫిర్యాదు చేశారు.
మహాధర్నాకు పర్యావరణ ప్రేమికుడు అశోక్‌కుమార్, జానపద కళాకారుడు వీఎం ఎల్లయ్య, బీఆర్ఎస్ నాయకుడు గోవర్ధన్‌రెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు. ధర్నాలో కేవీపీసీ కన్వీనర్లు మంగయ్య, బాల్‌రెడ్డి, కో-కన్వీనర్లు శ్రీనివాస్‌రెడ్డి, జయపాల్‌రెడ్డి, శ్రీధర్, సభ్యులు రాజు, వెంకటేశ్, రమేశ్, యాదగిరి, బాలుగౌడ్, జయమ్మ, అనురాధ, అఖిల, అనసూజ, చింతల లక్ష్మీ, రూప, సంగీత, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.