మెహదీపట్నం మే 30: బక్రీద్ పండుగ సందర్భంగా వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడ వేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని టోలిచౌకి డివిజన్ ఏసీపీ సయ్యద్ ఫయాజ్ అన్నారు. శుక్రవారం టోలిచౌకి ఏసీపీ కార్యాలయంలో మసీద్ కమిటీ సభ్యులతో ఏసీపీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ సయ్యద్ ఫయాజ్ మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలన్నారు.
జీహెచ్ఎంసీ వారు ఇచ్చే కవర్లలోనే వ్యర్థాలను పారబోయాలన్నారు. పశువులను ఎక్కడపడితే అక్కడ వధించకుండా. పండుగ జరుపుకోవాలని సూచించారు. పలువురు యువకులు అనుచిత రీల్స్ చేసి వైరల్ చేస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.