సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): తండ్రి చిట్టీ డబ్బులు ఇవ్వడం లేదని కక్షతో 8 ఏండ్ల బాలుడిని దారుణంగా హత్య చేసిన నిందితుడికి కూకట్‌పల్లిలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టు ఉరిశిక్ష విధిస్తూ మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. 2023 సంవత్సరంలో సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హత్య కేసులో ఇరువైపుల వాదనలు విన్న మూడో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి వెంకటేశ్వర్రావు తీర్పు వెల్లడించారు.
ప్రధాన నిందితుడికి ఉరిశిక్ష, సహకరించిన మరో నిందితుడికి ఏడేండ్ల జైలు శిక్ష విధించారు. సనత్‌నగర్ పోలీస్‌ష్టేషన్ పరిధిలోని అల్లాఉద్దీన్ కాలనీలో నివాసముండే వాసిమ్‌ఖాన్, అబ్దుల్ వహిద్(8) తండ్రీ కొడుకులు. కాగా స్థానికంగా ఉండే ఇమ్రాన్ అలీఖాన్.. వహిద్‌ను పక్కా ప్లాన్‌తో చంపేసినట్లు తేల్చారు.