Hyderabad | పోలీస్ స్టేషన్లోనే ఓ నిందితుడు అత్యుత్సాహం చూపించాడు. బాలిక కిడ్నాప్ కేసులో అరెస్టయి లాకప్‌లో ఉంటూనే రీల్స్ చేస్తూ సోషల్‌మీడియాలో పెట్టాడు. అందులో బాలిక కుటుంబంపై కూడా విమర్శలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రేమ పేరుతో తమ అమ్మాయిని ఎత్తుకెళ్లాడని హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన ఓ తల్లి బండ్లగూడ పోలీసులను ఆశ్రయించింది. స్థానిక యువకుడు దస్తగిరిపై అనుమానం వ్యక్తం చేసింది. బాధిత తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ బాలిక ఆచూకీని కనిపెట్టలేకపోయారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో బాలిక తల్లి ఉన్నతాధికారులను ఆశ్రయించింది. దీంతో చేసేదేమీ లేక బండ్లగూడ పోలీసులు దస్తగిరిని తీసుకొచ్చి జైల్లో పెట్టారు.
A viral video filmed at the Bandlaguda Police Station in Hyderabad’s Old City shows a suspect in lock-up meeting another person while recording a reel, they had posted on Instagram also. This incident highlights the issue of VIP treatment to suspects, rowdies and criminals at… pic.twitter.com/WRaLmYJoLH
— Naseer Giyas (@NaseerGiyas) July 16, 2024
అయితే లాకప్‌లో ఉన్నప్పటికీ తన ఫ్రెండ్స్ సహాయంతో రీల్స్ చేస్తూ బాలిక కుటుంబంపై దస్తగిరి విమర్శలకు దిగాడు. ఈ వీడియోలు చేసిన బాధిత కుటుంబసభ్యులు, పాతబస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడికి రాజమర్యాదలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ స్టేషన్లోనే రీల్స్ చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.