కంటోన్మెంట్, జూన్ 10: జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న నిందితులను బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని వివరాలను వెల్లడించారు. సురారం కాలనీకి చెందిన రజాక్ ఖాన్(38), యోహను (30), వెంకటప్పయ్య (28) స్నేహితులు.
కొంత కాలంగా నగరంలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో పార్కింగ్ చేసి ఉన్న 14 ద్విచక్ర వాహనాలను దొంగిలించి, నకిలీ పత్రాలతో ఓఎల్ఎక్స్ యాప్ ద్వారా విక్రయిస్తున్నారు. నిందితులను అరెస్టు చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ అశోక్, ఏసీపీ గోపాలకృష్ణ మూర్తి, డీఐ సర్దార్ నాయక్, తుల్జీరాం, శివ శంకర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.