జగద్గిరిగుట్ట, మే 30: దోపిడీకి పాల్పడి మహిళ గొలుసు లాక్కెళిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం కుత్బుల్లార్ డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెళ్లడించారు. ఈనెల 26న శ్రీలత అనే మహిళ కుత్బుల్లాపూర్ బీరప్పనగర్‌లో మార్నింగ్ వాక్ చేస్తోంది. మున్సిపల్ ఆఫీసు దగ్గరలో వెనుకనుంచి ఆటోలో వచ్చిన కొందరు దుండగులు ఆమెపై దాడి చేసి, బాధితురాలి మెడలోని రెండుతులాల బంగారు గొలుసు, సెల్‌ఫోన్ లాక్కుని పరారయ్యారు.
ఆమె ఫిర్యాదుతో పోలీసులు సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేశారు. నిందితులు జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధి ఎల్లమ్మబండ సిక్కుబస్తీకి చెందిన వారిగా గుర్తించారు. ఎలమ్మబండలో ఆటో రిక్షా చోరీచేసి ఆపై బంగారు గొలుసు లాకెళ్లారు. పాతనేరస్తులైన వీరు కేపీహెచ్‌బీ, దుండిగల్, కుత్బుల్లాపూర్, చింతల్, హెచ్ఎంటీ అటవీ ప్రాంతాల్లో దోపిడీలు, చైన్‌స్నాచింగ్‌కు పాల్పడేవారు. వెల్డింగ్ పనులు చేసేవీరు మత్తు పదార్థాలకు బానిసై నేరాలకు పాల్పడుతున్నట్టు డీసీపీ తెలిపారు. కేసులో నిందితులు గోవింద్‌సింగ్, కరణ్‌సింగ్, హర్దీప్సింగ్ను రిమాండ్‌కు బాల నేరస్తుడిని జువైనల్ హోంకు పంపారు. వారినుంచి గొలుసు, ఆటో, బైక్ స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు
తెలిపారు.