హైదరాబాద్ : ప్రజాభవన్‌కు(Praja Bhavan) బాంబు బెదిరింపు కేసులో(Bomb threat case) నిందితుడిని(Accused arrested) పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్‌కు చెందిన నిందితుడు శివరామకృష్ణ మద్యం సేవించి పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసినట్లు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఘటనలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
కాగా, నిన్న మధ్యాహ్నం ప్రజాభవన్‌లో బాంబు పెట్టినట్లుగా పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. దాంతో అప్రమత్తమైన ప్రజాభవన్‌కు చేరుకొని విస్తృత సోదాలు నిర్వహించారు. సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు ఏవీ కనిపించలేదు. పోలీసులు ఫేక్ కాల్‌గా నిర్ధారించారు. దాంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.