మలక్‌పేట, డిసెంబర్ 8: మలక్‌పేట మెట్రో స్టేషన్ కింద బైక్‌లు తగులబెట్టిన నిందితుడిని ఆదివారం చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఇన్స్పెక్టర్ రాజు వెల్లడించారు.
ముంబై నగరం, మదీనా మసీదు ఈస్ట్ జోగేశ్వరీ ప్రాంతానికి చెందిన జాకీర్ మహ్మద్ అలియాస్ ఫాంటా(32).. 8 సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి చాదర్‌ఘాట్‌లో కూలీపనులు చేసుకుంటూ మలక్‌పేట మెట్రో స్టేషన్వద్ద ఫుట్‌పాత్‌పై పడుకుంటున్నాడు. మద్యానికి, దురాలవాట్లకు అలవాటు పడి.. సరదా కో సం వాహనాలను తగులబెట్టి సంతృప్తిని పొందుతాడు.
అందులో భాగంగానే ఈ నెల 6న మలక్‌పేట మెట్రో స్టేషన్ మెట్లకింద పా ర్కుచేసిన ఐదు ద్విచక్ర వాహనాలకు నిప్పంటించాడు. ఘటనానంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, మెట్రో స్టేషన్వద్ద సీసీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని గుర్తించారు. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ సహాయంతో పోలీసులు ఆదివారం ఉదయం అక్బర్‌బాగ్ ఎక్స్ రోడ్‌వద్ద నిందితుడు జాకీర్ మహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని ఒప్పుకోవడంతో అతడిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా.. నిందితుడు గతంలో కూడా డబీర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇలాగే వాహనాలను తగులబెట్టినాడని పోలీసులు తెలిపారు.