హైదరాబాద్ : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో(Panjagutta police station area) విషాదం చోటు చేసుకుంది. బైక్‌ను టెంపో వాహనం ఢీ కొట్టడంతో(Road accident,) ఓ యువతి దుర్మరణం(woman died ) చెందింది. వివరాల్లోకి వెళ్తే.. ఏఎస్ఐ శంకర్ తన కుమార్తె ప్రసన్నతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నాడు. ఇదే క్రమంలో పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని లైఫ్ స్టైల్ వద్దకు రాగానే వెనుక నుంచి టెంపో వాహనం వేగంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్ట్ నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read..