వెంగళరావునగర్, మే 26 : పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడిని అరెస్ట్ చేశారు. ఎస్ఆర్నగర్ పోలీసుల కథనం ప్రకారం.. అమీర్ పేట్‌కు చెందిన యువతి బెంగుళూరులో ఓ కామన్ ఫ్రెండ్స్ మీటింగ్ లో శశాంక్ వేలూరిని కలిసింది. తొలిచూపులోనే పెండ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. ఇద్దరూ కలిసి డేటింగ్ చేశారు. శారీరకంగా లోబర్చుకున్నాడు. మాస్టర్ చదువు కోసం యూకే వెళ్లిపోయాక ఆమె సోషల్ మీడియా అకౌంట్లన్నీ బ్లాక్ చేశాడు.
మోసం చేసిన ప్రియుడిపై బాధిత యువతి 2023 డిసెంబర్ 30వ తేదీన ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విదేశాలకు వెళ్లిన శశాంక్ ఇండియాకు తిరిగిరాగానే పట్టుకునేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సోమవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వస్తున్నట్లు ఇమిగ్రేషన్ అధికారులు సమాచారం అందించడంతో శశాంక్ ను ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.