Begumpet | బేగంపేట, ఆగస్టు 5: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను బెదిరించి.. నిర్బంధించి..లైంగికదాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. బేగంపేట పోలీసుల కథనం ప్రకారం.. బేగంపేటలో నివాసముండే వ్యక్తి ఆదివారం విధుల కోసం బయటకు వెళ్లాడు. ఇంట్లో కూతురు ఒంటరిగా ఉంది. పని ముగించుకొని సాయంత్రం అతడు ఇంటికి వచ్చాడు.
తలుపు తట్టినా.. కూతురు తీయకపోవడంతో కంగారు పడి..బలవంతంగా నెట్టాడు. అంతలోనే సోనూ(20) అనే యువకుడు తోసుకుంటూ.. బయటకు పరుగులు తీశాడు. ఏం జరిగిందని తండ్రి కూతురును ఆరా తీయగా, తన నోట్లో గుడ్డలు కుక్కి నిర్బంధించి లైంగికదాడికి పాల్పడినట్లు తెలిపింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న బేగంపేట పోలీసులు..పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.