హైదరాబాద్ : చైనా మాంజ(China manja) జనం ప్రాణాలు తీస్తున్నాయి. చైనా మాంజ అమ్మకాలను హైకోర్టు(High Court)నిషేధించిన నగరంలో విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా ఉప్పల్లో మాంజ తగిలి ఓ యువకుడు గాయపడ్డాడు. సాయివర్దన్ రెడ్డి అనే యువకుడు బైక్పై వెళుతుండా గొంతుకు మాంజ తగలడంతో త్రీంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని వెంటనే ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు.
ప్రస్తుతం సాయివర్దన్ ఆరోగ్యం నిలకడగాను ఉందని వైద్యులు తెలిపారు. కాగా, చైనా మాంజ కారణంగా మనుషులతో పాటు పక్షులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పక్షులు, విద్యుత్ తీగలు, ప్రజా ఆస్తులకు కూడా భారీ నష్టం జరుగుతుందని పోలీసులు తనిఖీలు పెంచి మాంజ విక్రయాలను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.